IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా | IPL: If you party late into the night, how will you play in the morning?- Suresh Raina - Telugu MyKhel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఘూటు విమర్శలు చేశాడు. లేట్ నైట్ పార్టీలతోనే ట్రోఫీలను అందుకోలేకపోతున్నాయని అన్నాడు. గత 16 సీజన్లగా కప్‌ను సాధించాలనే కల ఆర్సీబీ, పంజాబ్, ఢిల్లీకి కలగానే మిగిలిన విషయం తెలిసిందే. అయితే ఫ్రాంచైజీలో అంతర్గతంగా జరుగుతున్న విషయాలపై రైనా షాకింగ్ కామెంట్స్ చేశాడు.

''చెన్నై సూపర్ కింగ్స్ పార్టీలకు దూరంగా ఉంటుంది. అందుకే అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. పార్టీలు చేసుకునే రెండు, మూడు జట్లు ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్‌ను గెలవలేకోయింది'' అని రైనా ఓ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా, ఆ కార్యక్రమంలో హోస్ట్‌ చేసిన వ్యక్తి.. ఆర్సీబీ గురించి చెబుతున్నారా అని రైనాను ప్రశ్నించాడు.

IPL If you party late into the night how will you play in the morning - Suresh Raina

దానికి రైనా బదులిస్తూ.. ''కాదు. టైటిల్ గెలవని కొన్ని జట్లు గురించి చెబుతున్నాను. వాళ్లు కచ్చితంగా హార్డ్ పార్టీస్ చేసుకుంటారు. సీఎస్కే అలా చేయదు. అందుకే ఐపీఎల్‌లో అయిదు సార్లు విజేతగా నిలచింది. రెండు సార్లు ఛాంపియన్ లీగ్ ట్రోఫీలను గెలుచుకుంది. ముంబై ఇండియన్స్ కూడా అయిదు ట్రోఫీలు సాధించింది''

''రాత్రంతా పార్టీ చేసుకుని కూర్చుంటే, ఆ తర్వాత రోజు ఎలా ఆడతారు? మే-జూన్ నెలల్లో వేడి ఎక్కువగా ఉంటుంది. లేట్ నైట్ పార్టీలతో మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లను ఎలా ఆడగలరు? మేం భారత్ తరఫున కూడా ప్రాతినిథ్యం వహిస్తున్నాం అనే విషయాన్ని మైండ్‌లో ఉంచుకోవాలి. నేను సరిగా ఆడలేకపోతే, నా కెప్టెన్ ఎలా సెలక్ట్ చేస్తాడు? నేను ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాను. రిటైర్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు మనం పార్టీలు చేసుకోవచ్చు'' అని రైనా పేర్కొన్నాడు.

సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి రైనా మాట్లాడాడు. ఐపీఎల్‌లో చెన్నై నడిపించే సమయంలో ధోనీ చాలా రిలాక్స్‌గా ఉన్నాడని రైనా చెప్పాడు. కానీ గ్లోబల్ స్టేజ్ వంటి టోర్నీలో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తు సమయంలో ధోనీ ఒత్తిడి ఎదుర్కొన్నాడని తెలిపాడు.

Story first published: Tuesday, April 23, 2024, 13:51 [IST]
Other articles published on Apr 23, 2024
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X