RCB vs DC: దినేశ్ కార్తీక్ చెత్త రికార్డ్..! | RCB vs DC: Dinesh Karthik creates unwanted record as most ducks in IPL - Telugu MyKhel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs DC: దినేశ్ కార్తీక్ చెత్త రికార్డ్..!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ సిల్వర్ డక్‌గా వెనుదిరిగాడు.

ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఐపీఎల్‌లో డకౌటవ్వడం దినేశ్ కార్తీక్‌కు ఇది 18వ సారి. ఈ క్రమంలో అతను రోహిత్ శర్మ చెత్త రికార్డును అధిగమించాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్లలో దినేశ్ కార్తీక్(18) టాప్‌లో ఉండగా.. రోహిత్ శర్మ(17), గ్లేన్ మ్యాక్స్‌వెల్(17), సునీల్ నరైన్(16), పియూష్ చావ్లా(16) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

RCB vs DC Dinesh Karthik creates unwanted record as most ducks in IPL

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. రజత్ పటీదార్(32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. కామెరూన్ గ్రీన్(24 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 32 నాటౌట్), విల్ జాక్స్(29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) రాణించారు.

విరాట్ కోహ్లీ(13 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 27) ధాటిగా ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో రసిక్ సలామ్(2/23), ఖలీల్ అహ్మద్(2/31) రెండేసి వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.

Story first published: Sunday, May 12, 2024, 22:47 [IST]
Other articles published on May 12, 2024
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X