Malvika Sharma: టాప్ విప్పేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఈ ఫొటోలను మీరు చూశారంటే! | Actress Malvika Sharma Latest Stunning Photos - Filmibeat Telugu
    twitter
    bredcrumb

    Malvika Sharma: టాప్ విప్పేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఈ ఫొటోలను మీరు చూశారంటే!

    By Pichuka Manoj Kumar
    | Published: Tuesday, May 14, 2024, 18:03 [IST]
    టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మాళవిక శర్మ సోషల్ మీడియాలోనూ తనదైన రీతిలో సెగలు రేపుతోంది. ఇందులో భాగంగానే ఈ చిన్నది కొన్ని పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!
    Malvika Sharma
    1/10
    ఈ మధ్య కాలంలోనే టాలీవుడ్‌లోకి ఎంతో మంది గ్లామరస్ లేడీలు హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. వారిలో కొందరు మాత్రం అందం, అభినయంతో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఫలితంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో మాళవిక శర్మ ఒకరు.
    Malvika Sharma Photoshoot
    2/10
    మాళవిక శర్మ బ్యాచ్‌లర్ ఆఫ్ లా చదువుకుంది. లాయర్ వృత్తిని ఎంచుకున్న ఈ బ్యూటీ అనూహ్యంగా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో తన అందచందాలతో మాయ చేసి తక్కువ సమయంలోనే యమ ఫేమస్ అయిపోయింది.
    Malvika Sharma Photos
    3/10
    2018లో మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన ‘నేల టికెట్’ అనే చిత్రం ద్వారా మాళవిక నటిగా పరిచయమైంది. కానీ, ఈ చిత్రం ప్రేక్షకుల స్పందనను పెద్దగా అందుకోలేకపోయింది.
    Malvika Sharma Photo
    4/10
    ‘నేల టికెట్’ సినిమా హిట్ కాకున్నా మాళవిక శర్మ అదిరిపోయే నటనతో అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే సమయంలో విమర్శకుల ప్రశంసలను సైతం దక్కించుకుని సత్తా చాటింది.
    Heroine Malvika Sharma Photoshoot
    5/10
    మాళవిక.. రామ్ నటించిన ‘రెడ్’ మూవీలో హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రంతో ఆమె మొదటి విజయాన్ని అందుకుంది. దీని తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు కూడా లభించాయి.
    Heroine Malvika Sharma Photo
    6/10
    టాలీవుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న మాళవిక శర్మ.. ఆ తర్వాత వరుసగా సినిమాలు మాత్రం చేయలేకపోయింది. కానీ, తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది.
    Tollywood Heroine Malvika Sharma Photoshoot
    7/10
    యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మాళవిక శర్మ ఇప్పటికే తమిళంలో ‘కాఫీ విత్ కాదల్’, తెలుగులో గోపీచంద్‌తో ‘భీమా’ మూవీలు చేసింది. కానీ, ఇవి ఆమెకు నిరాశనే మిగిల్చాయి.
    Tollywood Heroine Malvika Sharma Photo
    8/10
    తెలుగులో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతోన్న మాళవిక శర్మ.. తమిళంలో మాత్రం ఆఫర్లను స్పీడుగానే సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే ఈ బ్యూటీ కొన్ని ప్రాజెక్టులను సైతం దక్కించుకుంది.
    Tollywood Heroine Malvika Sharma Photos
    9/10
    మాళవిక.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X