Bigg Boss Telugu 8: కొత్త సీజన్‌పై సంచలన నిర్ణయం.. అంటే అది ఇంక లేనట్లేనా! | Bigg Boss Telugu 8th Season Starts From July Month - Telugu Filmibeat
    twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 8: కొత్త సీజన్‌పై సంచలన నిర్ణయం.. అంటే అది ఇంక లేనట్లేనా!

    |

    అసలు ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి వచ్చినా.. ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకుల మన్ననలు అందుకున్న షోనే బిగ్ బాస్. కొత్త కాన్సెప్టుతో వచ్చినా ఇది ఎవరూ ఊహించని రీతిలో ఆదరణను అందుకుని సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. ఇలా ఇప్పటికే ఏడింటిని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఎనిమిదో సీజన్‌ను మొదలు పెట్టబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా సమాచారం? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!

    అలా ఇలా.. అన్నీ సక్సెస్
    ఇండియాలోని చాలా భాషల కంటే ఆలస్యంగా వచ్చినా తెలుగులో నెంబన్ వన్ అయిన షోనే బిగ్ బాస్. అందుకే నిర్వహకులు అస్సలు గ్యాప్ లేకుండా ప్రతి ఏడాది కనీసం ఒక సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను ఇది కంప్లీట్ చేసుకుంది. ఇవన్నీ భారీ రేటింగ్‌ను సొంతం చేసుకుని సూపర్ డూపర్ సక్సెస్ అయ్యాయి.

    Anchor Anasuya: బుల్లి నిక్కరులో అనసూయ ఓవర్ షో.. అసలైన గ్లామర్‌ను చూపించేలా ఘాటు ఫోజులుAnchor Anasuya: బుల్లి నిక్కరులో అనసూయ ఓవర్ షో.. అసలైన గ్లామర్‌ను చూపించేలా ఘాటు ఫోజులు

    Bigg Boss Telugu 8th Season Starts From July Month

    ఏడో సీజన్‌ టాప్ రేటింగ్‌
    గతంలో వచ్చిన సీజన్లు అన్నీ హిట్ అవడంతో బిగ్ బాస్ టీమ్ గత ఏడాది ఏడో దానిని మొదలు పెట్టింది. ఉల్టా పుల్టా కాన్సెప్టుతో వచ్చిన ఇందులో గతంలో ఎన్నడూ చూడని కొత్త కంటెంట్‌ను తీసుకొచ్చి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. ఎన్నో ట్విస్టులతో సాగిన ఏడో సీజన్ ఫినాలేలో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఈ ఫినాలేకు దేశంలోనే టాప్ రేటింగ్ దక్కింది.

    ఓటీటీ సీజన్ ఉంటుంది
    బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ కనీవినీ ఎరుగని రీతిలో సక్సెస్ అవడంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ సెకెండ్ సీజన్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించి ఎలాగైనా సక్సెస్ చేయాలన్న పట్టుదలతో నిర్వహకులు ఉన్నారని తెలిసింది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన పనులను కూడా మొదలు పెట్టేశారని అన్నారు. అయితే, దీనిపై ఎలాంటి సమాచారం తెలియడం లేదు.

    Vithika Sheru: సన్నని పైటతో వితిక వయ్యారాల ప్రదర్శన.. వరుణ్ సందేశ్ భార్య ఫొటోలు చూశారంటే!Vithika Sheru: సన్నని పైటతో వితిక వయ్యారాల ప్రదర్శన.. వరుణ్ సందేశ్ భార్య ఫొటోలు చూశారంటే!

    Bigg Boss Telugu 8th Season Starts From July Month

    ఎనిమిదో సీజన్ ముందే
    బిగ్ బాస్ ఏడో సీజన్ సూపర్ సక్సెస్ అవడంతో ఎనిమిదో సీజన్‌ను కాస్త ముందుగానే మొదలు పెట్టేందుకు ప్లాన్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మార్చి నుంచే పనులు మొదలుపెట్టాలని చూస్తున్నారట. కానీ, దీనిపై కూడా ఎలాంటి న్యూస్ రాలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఎనిమిదో సీజన్ పనులు మే నెల లాస్ట్ నుంచే మొదలు పెట్టబోతున్నారట.

    ఆ నెలలోనే కొత్త సీజన్
    బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని నిర్వహకులు భావిస్తున్నారని ఎప్పటి నుంచో అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సీజన్‌ను జూలై నుంచే స్టార్ట్ చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.

    <strong>నెట్ డ్రెస్‌లో సదా నాటీ ఫోజులు.. 40 ఏళ్ల ఏజ్‌లో అందాలన్నీ కనిపించేలా!</strong>నెట్ డ్రెస్‌లో సదా నాటీ ఫోజులు.. 40 ఏళ్ల ఏజ్‌లో అందాలన్నీ కనిపించేలా!

    Bigg Boss Telugu 8th Season Starts From July Month

    అంటే అది ఆపేసినట్లే
    వాస్తవానికి బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ భారీ సక్సెస్ అయింది. దీంతో వెంటనే రెండో దాన్ని కూడా మొదలు పెడతారని అంతా అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. దీంతో ఈ ఏడాది కచ్చితంగా ఓటీటీ సీజన్ ఉంటుందని టాక్ వచ్చింది. కానీ, ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను ముందే ప్లాన్ చేయడంతో ఈ ఏడాది కూడా నాన్ స్టాప్ సీజన్ క్యాన్సిల్ అయిందని సమాచారం.

    English summary
    Bigg Boss Telugu Show Running Successfully. This Was Completed Seven Seasons Already. This Show 8th Season Starts From July Month.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X