SAVITA : నియంత పాలనకు ఇక మూడు రోజులే.. | Only three days left for the dictator's rule.
Share News

SAVITA : నియంత పాలనకు ఇక మూడు రోజులే..

ABN , Publish Date - May 10 , 2024 | 12:38 AM

ఐదేళ్ల జగన్మోహనరెడ్డి నియంత పాలన ఇక మూడురోజుల్లో అంతం కాబోతోందని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్య ర్థి సవిత, ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారఽథి పే ర్కొన్నారు. గోరంట్ల పట్టణంలో గురు వారం నిర్వహించిన రోడ్‌షోలో వారితోపాటు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, బీకేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్‌ పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెం డాలు పట్టుకుని, ద్విచక్రవాహనాల్లో హోరెత్తిం చారు. కదిరి రోడ్డులోని పెట్రోల్‌ బంక్‌ వద్ద నుంచి ప్రధాన రహదారిపై రోడ్‌షో నిర్వహించగా గజ మాల లు వేయడానికి కూటమి నాయకులు పోటీపడ్డారు.

SAVITA : నియంత పాలనకు ఇక మూడు రోజులే..
Savita, BK, GM Shekhar participated in Gorantla Roadshow

టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు సవిత, బీకే

గోరంట్ల, మే 9: ఐదేళ్ల జగన్మోహనరెడ్డి నియంత పాలన ఇక మూడురోజుల్లో అంతం కాబోతోందని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్య ర్థి సవిత, ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారఽథి పే ర్కొన్నారు. గోరంట్ల పట్టణంలో గురు వారం నిర్వహించిన రోడ్‌షోలో వారితోపాటు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, బీకేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్‌ పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెం డాలు పట్టుకుని, ద్విచక్రవాహనాల్లో హోరెత్తిం చారు. కదిరి రోడ్డులోని పెట్రోల్‌ బంక్‌ వద్ద నుంచి ప్రధాన రహదారిపై రోడ్‌షో నిర్వహించగా గజ మాల లు వేయడానికి కూటమి నాయకులు పోటీపడ్డారు. గుమ్మయ్యగారిపల్లి వరకు రోడ్‌ షో సాగింది. ప్రధాన కూడలిలో సవిత మాట్లడుతూ... వైసీపీ పాలనలో భూక బ్జాలు, దందాలు, బెదిరింపులు, దోచుకోవడం తప్ప అభివృద్ధి లేదని, అలాంటి వారికి ప్రజలను ఓటు అడిగే హక్కులేదన్నారు. జగన దోచుకున్నది చాలక ప్రత్యేకంగా భూచట్టాన్ని తెచ్చారన్నా రు.


క్రమక్రమంగా ప్రజల భూ ములు లాక్కోవడానికి ఇదొక ఎత్తుగడ అని మండిపడ్డా రు. పదేళ్ల రాజకీయ చరిత్ర కలిగిన వైసీపీకి పార్లమెం టు పరిఽధిలో పోటీ చేయడానికి స్థానిక అభ్యర్థులు లేకపోవడం వారి దౌర్భాగ్యన్నారు. గోరంట్లకు తాగునీటి సమస్య పరిష్కరిస్తామని, శ్మశానం ఏర్పాటు చేస్తామని, చెరువులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో అందు బాటులో ఉండే తనను పార్థ సారథిని ఆఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. బీకే మాట్లాడుతూ... వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలతో రాష్ట్రంలో అన్ని వర్గాలను సర్వనాశం చేశారని, వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ముఖ్యమంత్రి పెద్ద కొండలను మింగుతుంటే, ఎమ్మెల్యేలు చిన్నకొండలను స్వాహా చేస్తున్నారన్నారు. తాను ఇసుక దోచుకున్నానని అవినీతి సొమ్ముతో వెలసిన జగన సొంత పత్రికలో లేనిపోని ఆ రోపణలు చేశారని బీకే మండిపడ్డారు. తన జీవితం తెర చిన పుస్తకం అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 450 అంగనవాడీ ఉద్యోగాలకు పైసా ఆశించలేదని, ఎమ్మెల్యే శంకర్‌నారాయణ ఒక పోస్టుకు రూ.9లక్షల వంతున తీ సుకున్నది వాస్తవం కాదా అన్నారు. బీజేపీ జిల్లా అఽధ్య క్షుడు జీఎం శేఖర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో నరకాసుర పాలన ఐదేళ్లుగా సాగిందని 80శాతం కేంద్ర నిధులతో రాష్ట్రాన్ని నడిపారన్నారు.


మీ భవిష్యత్తు బాధ్యత మీదే

మీ ప్రాంతం, రాష్ట్రం బాగుపడాలన్నా... మీరు, మీ పిల్లల భవిష్యత్తు క్షేమంగా ఉండాలన్నా ఆలోచించి ఎన్ని కల్లో నిర్ణయించుకోవాలని టీడీపీ కూటమి అభ్యర్థి సవిత పేర్కొన్నారు. మళ్లీ పొరపాటు చేస్తే మీ భవిష్యత్తుకు మీరే బాధ్యులవుతారని హెచ్చరించారు. ఆమె గురు వారం మండలంలోని నారసింహపల్లి పంచాయతీలోని బూడిదగడ్డపల్లి, చింతలపల్లి, ఎర్రపల్లి, నారసింహపల్లి ల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఆమెకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. మల్లాపల్లికి చెందిన వసంతరావు, వెంకమ్మ, నాగరాజురావు, అన్నపూ ర్ణమ్మ, గాయత్రి, లక్ష్మమ్మ, నరసింహ, కొత్తపల్లి గొల్లనాగరాజు వైసీపీనుంచి టీడీపీలో చేరారు. కార్యక్రమంలో కన్వీనర్‌ సోముశేఖర్‌, రాజారెడ్డి, నందమోహనరెడ్డి, సోమలింగా రెడ్డి, మహమ్మద్‌, సుధాకర్‌రెడ్డి, నరేష్‌యాదవ్‌, లక్ష్మీపతి తదితరలు, జనసేన, బీజేపీ నాయకులున్నారు.


రొద్దం: మండంలోని శ్యాపురానికి చెందిన చెందిన వైసీపీ ఎంపీటీసీ గొల్ల రమేష్‌ 17 కుటుంబాలతో సవిత సమక్షంలో టీడీపీలోకి చేరారు. ఎం కొత్తపల్లికి చెందిన ఏడు కుటుంబాలు టీడీపీలో చేరారు. కార్యక్రమంలో మాధవనాయుడు, కంబాలపల్లి సర్పంచ మంజు, పోత న్న, మాజీ ఎంపీటీసీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 10 , 2024 | 12:38 AM