Love Guru Review: రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా?
Love Guru Review; చిత్రం: లవ్‌గురు; నటీనటులు: విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి, యోగిబాబు, వీటీవీ గణేష్, ఇలవరుసు, శ్రీజ రవి, తలైవసల్ విజయ్ తదితరులు; సంగీతం: భరత్ ధన శేఖర్; సినిమాటోగ్రఫీ: ఫారూక్ బాష; ఎడిటింగ్: విజయ్ ఆంటోనీ; నిర్మాత: మీరా విజయ్ ఆంటోనీ, విజయ ఆంటోనీ, సంద్రా జాన్సన్, నవీన్‌కుమార్; రచన, దర్శకత్వం: వినాయక్ వైద్యనాథన్; విడుదల: 11-04-2024
ప్రయోగాలకు పెట్టింది పేరు విజయ్ ఆంటోని. ఎక్కువగా థ్రిల్లర్ కథలతో ప్రేక్షకుల్ని పలకరించే ఆయన.. తొలిసారి రొమాంటిక్ జానర్లో చేసిన చిత్రం ‘లవ్ గురు’. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని తెలుగులో చేసింది. మరి ఈ మూవీ ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుందా? విజయ్ ఆంటోనికి మరో విజయాన్ని అందించిందా?
కథేంటంటే: అరవింద్ (విజయ్ ఆంటోని) మలేసియాలో కేఫ్ నడుపుతుంటాడు. అతన్ని తన చెల్లి తాలూకూ ఓ చేదు గతం వెంటాడుతుంటుంది. మరోవైపు ఆర్థిక సమస్యల నుంచి ఇంటిని గట్టేక్కించే క్రమంలో వృత్తిలో పడి వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. అందుకే 35ఏళ్ల వయసొచ్చినా ప్రేమ, పెళ్లికి నోచుకోలేకపోతాడు. అయితే ఈ సింగిల్ జీవితానికి ముగింపు చెప్పాలన్న లక్ష్యంతో మలేసియా నుంచి ఇండియాకు తిరిగొచ్చిన అరవింద్.. అనుకోకుండా ఓ చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీల (మృణాళిని రవి)ని చూసి మనసు పారేసుకుంటాడు. దీన్ని గ్రహించిన అతని తల్లిదండ్రులు వెంటనే లీలా తండ్రితో పెళ్లి సంబంధం మాట్లాడతారు.(Love Guru Review) కానీ, లీలాకు ఆ పెళ్లి అసలు ఇష్టముండదు. ఎందుకంటే సినిమా హీరోయిన్ కావాలన్నది ఆమె జీవిత లక్ష్యం. అయితే ఆమె నటిగా మారడాన్ని అంగీకరించని తండ్రి అరవింద్‌తో వివాహం జరిపిస్తాడు. కానీ, పెళ్లైన మరుసటి రోజే లీలాకు తనతో పెళ్లి ఇష్టం లేదన్న సంగతి అరవింద్‌కు అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఆమె అతన్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అరవింద్ తన భార్య మనసు గెలుచుకునేందుకు ఏం చేశాడు? అతన్ని వెంటాడుతున్న చెల్లి తాలూకూ చేదు గతమేంటి? హీరోయిన్ అవ్వాలన్న లీలా లక్ష్యం నెరవేరిందా? లేదా? ఆమె ఆఖరికి అరవింద్‌ను భర్తగా అంగీకరించిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా సాగిందంటే: ఓ పెద్ద జీవిత లక్ష్యంతో ముందుకు సాగుతున్న అమ్మాయి ఇష్టం లేకున్నా పెద్దల బలవంతంతో పెళ్లికి సిద్ధపడటం.. మూడుముళ్లు పడ్డాక ఆమె తన లక్ష్యం కోసం భర్తను దూరం పెట్టడం.. ఆమె మనసు గెలుచుకునేందుకు ఆ భర్త రకరకాల ప్రయత్నాలు చేయడం.. ముగింపులో ఇద్దరూ ఒక్కటవ్వడం.. ఈ తరహా ఫ్యామిలీడ్రామా చిత్రాలు తెలుగు తెరపై చాలా వచ్చాయి. ఈ ‘లవ్ గురు’ కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. కాకపోతే దర్శకుడు దీన్ని వినోదాత్మకంగా తీర్చిదిద్దుకున్న తీరు.. ఆ కథకు చెల్లి సెంటిమెంట్‌ను జోడించి భావోద్వేగభరితంగా తెరపై చూపించిన విధానం సినిమాకి ఓ కొత్త లుక్‌ను తీసుకొచ్చాయి.(Love Guru Review) క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఒక భర్త తన భార్య మనసు గెలవడానికి ప్రయత్నించే కథగా ఉంటుంది. దీని ద్వారా పెళ్లి అనేది స్త్రీ కలలకు అడ్డంకి కాదు అనే ఓ సందేశాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు దర్శకుడు.
కథలో చెప్పుకొన్నట్లుగానే ఒక రొటీన్ డ్రామాతో సినిమా ఆరంభమవుతుంది. అరవింద్ - లీలా పెళ్లయి హైదరాబాద్‌కు మకాం మార్చినప్పటి నుంచి కథలో వినోదం మొదలవుతుంది. అప్పటి వరకు సంప్రదాయబద్ధంగా కనిపించిన లీలా ఒక్కసారిగా మోడ్రన్ గర్ల్ అవతారమెత్తడం.. ఇంట్లో ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె చేసే హంగామా.. అరవింద్‌ను దూరం పెట్టేందుకు చేసే ప్రయత్నాలు.. వాటిని అతను తన ప్రేమతో తిప్పికొట్టే విధానం అన్నీ మంచి కాలక్షేపాన్నిస్తాయి. ఈ మధ్యలో విజయ్ ఆంటోనికి.. వీటీవీ గణేష్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. విరామానికి ముందు యోగిబాబు పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో కథ మలుపు తిరుగుతుంది. అతని సలహాతో భార్య ప్రేమను గెలుచుకునేందుకు హీరో మరో వ్యక్తిగా ఆమెకు ఫోన్ పరిచయమవడమన్నది షారుక్ ఖాన్ ‘రబ్ నే బనా ది జోడీ’ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. ఇక విరామ సమయానికి లీలాను హీరోయిన్ చేసేందుకు అరవింద్ నిర్మాతగా మారాలని నిర్ణయించుకోవడం.. ఆ చిత్రంలో తనే హీరోగా నటిస్తానని షరతు పెట్టడంతో ద్వితీయార్ధం ఏం జరుగుతుందన్న ఆసక్తి మొదలవుతుంది. (Love Guru Review) అయితే ప్రథమార్ధమంతా ఫన్నీగా సాగిన కథనం.. ద్వితీయార్ధంలో భావోద్వేగభరితంగా మారుతుంది. ముఖ్యంగా అరవింద్ తన చెల్లికి దూరమైన ఎపిసోడ్ కథను కాస్త సీరియస్‌గా మారుస్తుంది. అలాగే ముగింపులో అరవింద్, లీలాకు మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌గా ఆకట్టుకుంటాయి. ఈ మధ్యలో ‘లవ్ గురు’ సినిమా చిత్రీకరణ పేరుతో అరవింద్ - లీలా చేసే హంగామా కాస్త బోర్ కొట్టిస్తుంది.
ఎవరెలా చేశారంటే: వైవిధ్య పాత్రలకు భిన్నంగా అరవింద్‌గా విజయ్ ఆంటోని కొత్త ప్రయత్నం చేశారు. కామెడీ, ఎమోషనల్ సీన్స్‌లో చక్కటి నటన కనబరిచారు. ముఖ్యంగా ముగింపులో తనకు.. మృణాళినికి మధ్య వచ్చే ఎపిసోడ్లో ఆయన నటన భావోద్వేగభరితంగా ఉంటుంది. లీలాగా మృణాళిని తెరపై అందంగా కనిపించింది. ఆమె తెరపై ఆద్యంతం కనిపించినా.. నటనకు పెద్దగా స్కోప్ దొరికినట్లు అనిపించదు. (Love Guru Review) విజయ్ మామయ్యగా వీటీవీ గణేష్ కనిపించినంత సేపూ నవ్వించే ప్రయత్నం చేశారు. ప్రేమ సలహాలు ఇచ్చే పాత్రలో యోగిబాబు కూడా అక్కడక్కడా నవ్విస్తారు. ఇళవరసు, సుధ, తలైవాసల్ విజయ్ తదితరుల పాత్రలన్నీ పరిధి మేరకు ఉంటాయి. దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం కనిపించదు. కథనమంతా ఊహలకు తగ్గట్లుగానే సాగుతుంది. కానీ, సినిమాని ఎక్కడా బోర్ కొట్టించనీయకుండా తీర్చిదిద్దడంలో సఫలమయ్యాడు.
- బలాలు
- + వినోదాత్మకంగా కథను నడిపిన తీరు
- + విజయ్ ఆంటోని, మృణాళిని నటన
- + పతాక సన్నివేశాలు
- బలహీనతలు
- - పాటలు
- - ఊహలకు తగ్గట్లుగా సాగే సన్నివేశాలు
- చివరిగా: కాలక్షేపాన్నిచ్చే ‘లవ్ గురు’ (Love Guru Review)
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: లవ్ మి.. ఆశిష్, వైష్ణవి చైతన్య నటించిన మూవీ మెప్పించిందా?
Love Me Review Telugu: ఆశిష్, వైష్ణవి చైతన్య కీలక పాత్రల్లో అరుణ్ భీమవరపు రూపొందించిన హారర్, రొమాంటిక్ మూవీ ఎలా ఉంది. -
రివ్యూ: ఆరంభం.. డెజావు కాన్సెప్ట్‌తో రూపొందిన మూవీ ఎలా ఉందంటే?
మోహన్ భగత్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘ఆరంభం’. ఓటీటీ ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలా ఉందంటే? -
రివ్యూ: రాజు యాదవ్.. గెటప్ శ్రీను హీరోగా చేసిన మూవీ ఎలా ఉంది?
‘జబర్దస్త్’ షోతో పాటు, వివిధ చిత్రాల్లో హాస్య నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రాజు యాదవ్’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: విద్య వాసుల అహం.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?
రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ నటించిన చిత్రం ‘విద్య వాసుల అహం’. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?
krishnamma movie review: సత్యదేవ్ కీలక పాత్రలో నటించిన మాస్, యాక్షన్ డ్రామా ఎలా ఉంది? -
రివ్యూ: ప్రతినిధి2.. నారా రోహిత్ పొలిటికల్ డ్రామా ఎలా ఉంది?
Prathinidhi 2 Review: నారా రోహిత్ కీలక పాత్రలో నటించిన ‘ప్రతినిధి2’ ప్రేక్షకుల మెప్పించిందా? -
రివ్యూ: ఆవేశం.. రూ.150 కోట్లు వసూలు చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?
ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించిన మలయాళ సూపర్‌హిట్ మూవీ ‘ఆవేశం’ మెప్పించిందా? -
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
మమితా బైజు, అర్జున్ అశోకన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథేంటంటే? -
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
baak movie review: ‘అరణ్మనై’ సిరీస్‌లో నాలుగో భాగంగా వచ్చిన ‘బాక్’మూవీ సినీ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
aa okkati adakku review: అల్లరి నరేష్, ఫరియా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ మెప్పించిందా. -
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
sabari movie review in telugu: వరలక్ష్మీ శరత్‌కుమార్, గణేశ్ వెంట్రామన్ కీలక పాత్రల్లో నటించిన ‘శబరి’ మెప్పించిందా? -
రివ్యూ: ప్రసన్నవదనం.. సుహాస్ ఖాతాలో హిట్ పడిందా?
సుహాస్ కీలక పాత్రలో ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్‌తో రూపొందిన థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది. -
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్‌లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
భారీ తారాగణంతో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌సిరీస్ మెప్పించిందా? -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా?
తాజా వార్తలు (Latest News)
-
ఆరోగ్య బీమా క్లెయిమ్ చిక్కులకు చెక్.. త్వరలో ప్రభుత్వ పోర్టల్!
-
ఐపీఎల్ ‘ఫైనల్’ వెదర్ రిపోర్ట్.. మ్యాచ్ జరగకపోతే పరిస్థితేంటి?
-
ఈ ఎన్నికలు మోదీ Vs రాహుల్ కాదు.. వారి మధ్యే..: ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు
-
జూన్ 14 తర్వాత ఆ ఆధార్ కార్డులు పనిచేయవా? ఉడాయ్ వివరణ..
-
పట్టాలు తప్పిన గూడ్స్.. గుంటూరు-సికింద్రాబాద్ మార్గంలో రైళ్లకు అంతరాయం
-
కొండచరియల బీభత్సం ఘటన.. 670 మంది సమాధి..!