మోదీపై వ్యతిరేక ప్రచారం.. జైలుపాలైన ఉపాధ్యాయుడు | bihar-govt-school-teacher-jailed-for-saying-nobody-should-vote-for-modi-inside-classroom

మోదీపై వ్యతిరేక ప్రచారం.. జైలుపాలైన ఉపాధ్యాయుడు

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఉపాధ్యాయుడిని అరెస్టు చేసిన పోలీసులు జైలుకు తరలించారు.

Published : 19 May 2024 23:20 IST

పట్నా: విద్యార్థులకు మంచి చదువు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడి ప్రవర్తన వివాదాస్పదమైంది. ప్రధాని మోదీ (PM Modi)కి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. దీంతో అతడిని జైలుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాకేశ్‌ కుమార్‌ బిహార్‌ (Bihar)లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు బోధించడానికి బదులు ప్రధానికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. ఉచిత రేషన్‌ పథకం కింద పేదలకు ఇస్తున్న బియ్యం తినేందుకు ఉపయోగపడట్లేదని, మోదీకి ఎవరూ ఓటు వేయొద్దు అంటూ తరగతి గదిలో చెప్పినట్లు ఆరోపణలు వచ్చాయి.

పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్‌ఎఫ్‌’ సిబ్బంది

టీచర్‌ మోదీకి వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో వారంతా ఉపాధ్యాయుడికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రాకేశ్‌ను అరెస్టు చేశారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని