OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు-illegal season 3 ott release date neha sharma piyush mitra legal drama to steam on jiocinema ott platform from this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Chatakonda Krishna Prakash HT Telugu
May 19, 2024 09:17 PM IST

Illegal 3 Web Series OTT Release Date: నేహా శర్మ ప్రధాన పాత్ర పోషించిన ఇల్లీగల్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది. ఈ సీజన్ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. తెలుగులోనూ ఈ సీజన్ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది.

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు
OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Illegal 3 OTT Release Date: ఓటీటీల్లో లీగల్ డ్రామా వెబ్ సిరీస్‍లు కూడా బాగానే వచ్చాయి. వాటిల్లో ‘ఇల్లీగల్’ సిరీస్ మంచి పాపులర్ అయింది. ఇల్లీగల్ వెబ్ సిరీస్ తొలి రెండు సీజన్లు మంచి సక్సెస్ సాధించాయి. దీంతో మూడో సీజన్‍పై కూడా చాలా అంచనాలు ఉన్నాయి. తాజాగా.. ఇల్లీగల్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ సిరీస్‍లో నేహా శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇల్లీగల్ మూడో సీజన్ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఇల్లీగల్ మూడో సీజన్ మే 29వ తేదీన జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ అధికారికంగా ఖరారు చేసింది. ఈ సీజన్ ట్రైలర్ కూడా వచ్చింది.

ఇల్లీగల్ సీజన్ 3 హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ మే 29న జియో సినిమాలో స్ట్రీమింగ్‍కు వస్తుంది. ఈ విషయాన్ని కూడా ఆ ఓటీటీ కన్ఫర్మ్ చేసింది.

ఇల్లీగల్ వెబ్ సిరీస్‍లో లాయర్ నిహారిక సింగ్ పాత్రలో నేహా శర్మ నటిస్తున్నారు. ఢిల్లీలోనే టాప్ లాయర్‌గా ఎదగాలని ఆమె లక్ష్యంగా ఉంటుంది. ఈ క్రమంలో ఓ హైప్రొఫైల్ కేసును వాదిస్తుంటారు. పియూష్ మిశ్రా, అక్షయ్ ఒబెరాయ్, నీల్ భూపాలం, జీన్ మారీ ఖాన్, అషీమా వర్దన్, ఐరా దూబే, ఆయుష్మాన్ మల్హోత్రా కీలకపాత్రలు పోషించారు.

ఇల్లీగల్ వెబ్ సిరీస్ మూడో సీజన్‍కు షాహిర్ రాజా దర్శకత్వం వహించారు. జగర్‌నట్ ప్రొడక్షన్స్ పతాకంపై సమర్ ఖాన్, ఆదిత్య పిట్టీ నిర్మించారు.

ఇల్లీగల్ వెబ్ సిరీస్ తొలి సీజన్ 2020లోనే వచ్చింది. సూపర్ పాపులర్ అయింది. ఆ తర్వాతి ఏడాదిలోనే రెండో సీజన్ కూడా వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తొలుత ఈ సిరీస్ రెండు సీజన్లు వూట్ ఓటీటీలోకి వచ్చాయి. ఆ తర్వాత జియో సినిమాలోకి కూడా అడుగుపెట్టాయి. మూడేళ్ల గ్యాప్ తర్వాత ఈ సిరీస్ మూడో సీజన్ వస్తోంది. దీంతో చాలా అంచనాలు ఉన్నాయి. ఇల్లీగల్ మూడో సీజన్‍ను మే 29వ తేదీ నుంచి జియోసినిమా ఓటీటీలో చూసేయవచ్చు.

‘మర్డర్ ఇన్ మహిమ్’కు మంచి రెస్పాన్స్

జియో సినిమా ఓటీటీ ప్లాట్‍‍ఫామ్‍లో ఇటీవలే మర్డర్ ఇన్ మహిమ్ అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చింది. మే 10న స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ సిరీస్‍కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్‍లో విజయ్ రాజ్, రాణా, శివానీతో పాటు శివాజీ సతమ్, స్మిత తాంబే, దివ్య జగల్దే, రాజేశ్ ఖట్టర్ ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్ అచార్య దర్శకత్వం వహించారు. మహిమ్ అనే రైల్వే స్టేషన్‍లో జరిగే ఓ యువకుడి హత్యపై ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సిరీస్ స్టోరీ ఉంటుంది.

జర హట్కే జర బచ్కే’ సినిమా మే 17వ తేదీన జియోసినిమా ఓటీటీలో అడుగుపెట్టింది. విక్కీ కౌశల్, సారా అలీఖాన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయిన 11 నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ బాలీవుడ్ కామెడీ ఫ్యామిలీ డ్రామా సినిమా తెలుగులోనూ జియోసినిమాలో అందుబాటులో ఉంది.

IPL_Entry_Point