The Call 2013 movie explained in Telugu | Best Thriller Movies On OTT: కారు డిక్కీలో చెయ్యి.. జుట్టు కోసం అమ్మాయిలను ఎత్తుకుపోయే కిల్లర్ - సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే థ్రిల్లర్ మూవీ ఇది
అన్వేషించండి

Best Thriller Movies On OTT: కారు డిక్కీలో చెయ్యి.. జుట్టు కోసం అమ్మాయిలను ఎత్తుకుపోయే కిల్లర్ - సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే థ్రిల్లర్ మూవీ ఇది

"ది కాల్" ఒక సైకలాజికల్ క్రైం థ్రిల్లర్. అమ్మాయిలను కిడ్నాప్ చేసి కిరాతకంగా చంపేసే ఒక సైకో బారి నుంచి ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ కు కాల్ చేసిన ఆ బాధితురాలిని 911 ఆపరేటర్ ఎలా రక్షిస్తుందనేది కథ.

అమ్మాయిలను కిరాతకంగా చంపేసే ఒక సైకో కిల్లర్ బారి నుంచి ఒక కిడ్నాప్ అయిన బాధితురాలిని ఎమర్జెన్సీ కాల్ సెంటర్ ఆపరేటర్ ఎలా కాపాడుతుందనేది ‘ది కాల్’ సినిమా కథ.

జోర్డన్ అనే మహిళ 911 కాల్ సెంటర్ లో పని చేస్తూ ఉంటుంది. సినిమా మొదట్లో ఎమర్జెన్సీ హెల్ప్ లైన్‌కు కూడా ఎలాంటి ఫేక్ కాల్స్ వస్తాయి. తాగుబోతులు 911కి కాల్ చేసి ఎలా విసిగిస్తారు అనేది క్లియర్‌గా చూపిస్తారు. ఆ తర్వాత 911కి 15 ఏళ్ల అమ్మాయి ఏడుస్తూ కాల్ చేస్తుంది. జోర్డన్ ఇటువైపు కాల్ రిసీవ్ చేస్తుంది. ఆ అమ్మాయి మా ఇంట్లో ఎవరూ లేరు. నేనొక్కదాన్నే ఉన్నాను. బయట నుంచి ఎవరో ఒక వ్యక్తి గట్టిగా డోర్ కొడుతున్నాడు. తనకు హెల్ప్ చేయమని భయంగా చెప్తుంటుంది.

జోర్డన్ ఆ అమ్మాయిని పైకి వెళ్లి దాక్కోమని చెబుతుంది.. పైకి వెళ్లేలోపే ఆ వ్యక్తి తలుపులు పగలగొట్టి లోపలికి వచ్చేస్తాడు. అప్పుడు జోర్డన్ ఆ అమ్మాయిని పైకెళ్లి కిటికీ తెరిచి ఆ పైనుంచి చెప్పులు కింద పడేసి, బెడ్ కింద దాక్కోమని చెబుతుంది.. ఆ అమ్మాయి అలాగే చేస్తుంది. ఇంట్లోకి చొరబడిన వ్యక్తి బాల్కనీ నుంచి కిందకు చూసి చెప్పులు కనపడగానే ఆ అమ్మాయి కిందకు దిగి పారిపోయిందనుకుంటాడు.

అపుడు కాల్ కట్ అయిపోతుంది. ఏం జరిగిందోననే భయంతో జోర్డన్ మళ్లీ ఆ నంబర్ కి కాల్ చేస్తుంది. అదే ఆమె చేసిన తప్పు. ఫోన్ రింగ్ వినపడగానే వెళ్లిపోతున్న ఆ వ్యక్తి మళ్ళీ పైకి వస్తాడు. బెడ్ కింద ఉన్న ఆ అమ్మాయిని బయటకు లాగి, ఫోన్ తీసుకుంటాడు. ఫోన్ లో జోర్డన్.. ఆ అమ్మాయిని వదిలిపెట్టమని చెబుతుంది. ఫోన్ ట్రాక్ చేశాం పోలీసులు వస్తున్నారు అని చెబుతుంది. దీంతో ఆ కిల్లర్ ఫోన్ కట్ చేసి, ఆ అమ్మాయిని కొడతాడు. మరుసటి రోజు టీవీలో ఆ అమ్మాయి ఘోరమైన స్థితిలో చనిపోయినట్టు న్యూస్ వస్తుంది. తన వల్లే ఇలా జరిగిందని జోర్డన్ కుమిలిపోతుంది. ఆరు నెలల తర్వాత ఈ కాల్ సెంటర్ జాబ్ చేయటం తన వల్ల కాదని మానేసి, అక్కడే కొత్తగా పని చేయటానికి వచ్చినవారికి ట్రైనింగ్ ఇస్తుంటుంది.

ఆ తర్వాత మరో కేసు ఆమె చేతికి వస్తుంది. అది మాత్రం నరాలు తెగిపోయే ఉత్కంఠతో సాగుతుంది. మాల్‌లో ఇద్దరు అమ్మాయిలు కూర్చొని ఉంటారు. అందులో ఒకామె ఆండ్రాయిడ్ ఫోన్ తో పాటు, పాతకాలం చిన్న ఫోన్ వాడుతుంది. ఇంతలో తన స్మార్ట్ ఫోన్‌కు బాయ్ ఫ్రెండ్ కాల్ చేయటంతో చిన్న ఫోన్ అక్కడే మర్చిపోయి వెళ్లిపోతుంది. ఆ ఫోన్‌ను మరో అమ్మాయి తీసుకొని జేబులో పెట్టుకొని వెళ్తుంది. వెనకాల ఒక వ్యక్తి కార్లో వచ్చి గుద్దుతాడు. ఆమె స్మార్ట్ ఫోన్ పగిలిపోతుంది. ఆమె తిరగబడేలోపు క్లోరో ఫార్మ్ పెట్టి ఆమె స్పృహ కోల్పోగానే కార్ డిక్కీలో ఎక్కించుకొని వెళ్తాడు. 

కాసేపటికి స్పృహ రాగానే తన పాకెట్ లో ఉన్న చిన్న ఫోన్‌తో 911కి కాల్ చేస్తుంది. అక్కడ ఉన్న కొత్త ట్రైనీ ఆపరేటర్‌కు సరిగ్గా రిసీవ్ చేసుకోవటం రాకపోవటంతో ఆ కాల్ వారికి ట్రైనింగ్ ఇస్తున్న జోర్డన్ ఆన్సర్ చేస్తుంది. కార్ డిక్కీలో నుంచి ఆ అమ్మాయి తనకు హెల్ప్ చేయమని ఏడుస్తుంటుంది. ఆ కార్‌లో ఏమున్నాయని జోర్డన్ అడుగుతుంది. పెయింట్ బ్రష్ కనపడుతుంది. ఆ బ్రష్ తో కార్ లైట్ పగలగొట్టి, చేయి బయటకు పెట్టి, ఊపితే ఎవరైనా 911కి కాల్ చేస్తారని చెప్పగానే, ఆమె అలాగే చేస్తుంది. ఒకరు అలాగే చూసి 911కి కాల్ చేస్తారు. అయితే ఆ కారు నెంబర్ పరిశీలించిన పోలీసులు షాకవుతారు. కిడ్నాపర్ ఆ కారుకు ఉన్న నెంబర్ ప్లేట్ డూప్లికేట్ అని తేలుతుంది.

ఆ తర్వాత జోర్డాన్ ఆ కారులో ఉన్న పెయింట్‌ను డిక్కీ నుంచి కిందకు పారబోస్తూ ఉండమని చెబుతుంది.. దాన్ని బట్టి హెలికాప్టర్ ద్వారా ఆ కార్‌ను పట్టుకోవచ్చని అనుకుంటుంది. అది గమనించి కొందరు ఆమెకు సాయం చేయడానికి వస్తారు. కానీ, ఆ సైకో వారందర్నీ కిరాతకంగా చంపేస్తుంటాడు. ఏ ప్రయత్నాలూ ఫలించవు.

అమ్మాయిల జుట్టు కోసం హత్యలు:

ఇంతకీ ఆ సైకో అమ్మాయిలను కిడ్నాప్ చెయ్యడానికి ప్రధాన కారణం.. జుట్టు. అమ్మాలను బంధించి వారి వారి జుట్టును చర్మంతో సహా పీకేస్తాడు. మరి, ఆ జుట్టును అతడు ఏం చేస్తాడు? ఎందుకు అలా చేస్తున్నాడు? మరి జోర్డాన్.. కిడ్నాపైన బాధితురాలిని కాపాడగలుగుతుందా? ఇదంతా తెలియాలంటే.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న ‘ది కాల్’ (2013) మూవీని చూడాల్సిందే.

Also Read: కూతురిని చంపాలనుకునే తల్లి కథ, మాస్క్ వేసుకొని మరీ వెంటాడుతుంది - అసలు ఇలా ఎవరైనా ఉంటారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Weather Latest Update: మరో 5 రోజులు భారీ వర్షాలు, 40 - 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు కూడా
మరో 5 రోజులు భారీ వర్షాలు, 40 - 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు కూడా
Revanth Reddy: తెలంగాణ ఆదాయం పెంచడంపై రేవంత్ రెడ్డి రివ్యూ, అధికారులకు కీలక ఆదేశాలు
తెలంగాణ ఆదాయం పెంచడంపై రేవంత్ రెడ్డి రివ్యూ, అధికారులకు కీలక ఆదేశాలు
IPL 2024:  ఎస్ఆర్‌హెచ్, గుజరాత్ మ్యాచ్ రద్దు - ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్!
ఎస్ఆర్‌హెచ్, గుజరాత్ మ్యాచ్ రద్దు - ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్!
Vidya Vasula Aham Review - విద్య వాసుల అహం రివ్యూ: AHA OTTలో కొత్త సినిమా... ఎలా ఉందంటే?
విద్య వాసుల అహం రివ్యూ: AHA OTTలో కొత్త సినిమా... ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Chandragiri TDP MLA Candidate Pulivarthi Nani | చంద్రగిరి ఇది..పులివెందుల కానివ్వను | ABP DesamNattikumar About IPAC | జగన్ లేని వైసీపీ లాంటిదే ప్రశాంత్ కిషోర్ లేని ఐప్యాక్ | ABP DesamPalnadu Police Recover Petrol bombs | మారణాయుధాలు పట్టుకున్న పల్నాడు పోలీసులు | ABP DesamHeavy Rains in Hyderabad | చెరువులను తలపించేలా హైదరాబాద్‌లో రహదారులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Weather Latest Update: మరో 5 రోజులు భారీ వర్షాలు, 40 - 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు కూడా
మరో 5 రోజులు భారీ వర్షాలు, 40 - 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు కూడా
Revanth Reddy: తెలంగాణ ఆదాయం పెంచడంపై రేవంత్ రెడ్డి రివ్యూ, అధికారులకు కీలక ఆదేశాలు
తెలంగాణ ఆదాయం పెంచడంపై రేవంత్ రెడ్డి రివ్యూ, అధికారులకు కీలక ఆదేశాలు
IPL 2024:  ఎస్ఆర్‌హెచ్, గుజరాత్ మ్యాచ్ రద్దు - ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్!
ఎస్ఆర్‌హెచ్, గుజరాత్ మ్యాచ్ రద్దు - ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్!
Vidya Vasula Aham Review - విద్య వాసుల అహం రివ్యూ: AHA OTTలో కొత్త సినిమా... ఎలా ఉందంటే?
విద్య వాసుల అహం రివ్యూ: AHA OTTలో కొత్త సినిమా... ఎలా ఉందంటే?
చనిపోయిన ఆత్మీయుల వస్త్రాలు, ఇతర వస్తువులు వాడుకోవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది?
చనిపోయిన ఆత్మీయుల వస్త్రాలు, ఇతర వస్తువులు వాడుకోవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది?
T Safe App: టీ సేఫ్‌తో మీ ప్రయాణం సేఫ్, తెలంగాణ పోలీసుల బాసట - ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు
టీ సేఫ్‌తో మీ ప్రయాణం సేఫ్, తెలంగాణ పోలీసుల బాసట - ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు
Krishnamma OTT Streaming: కృష్ణమ్మ ఓటీటీ రిలీజ్... షాక్ ఇచ్చిన సత్యదేవ్, థియేటర్లలో విడుదలైన ఏడు రోజులకే!
కృష్ణమ్మ ఓటీటీ రిలీజ్... షాక్ ఇచ్చిన సత్యదేవ్, థియేటర్లలో విడుదలైన ఏడు రోజులకే!
ITR 2024: ఫామ్‌-16లో ఏం ఉంటుంది, ఐటీఆర్‌ ఫైలింగ్‌లో ఈ డాక్యుమెంట్‌ ఎందుకు కీలకం?
ఫామ్‌-16లో ఏం ఉంటుంది, ఐటీఆర్‌ ఫైలింగ్‌లో ఈ డాక్యుమెంట్‌ ఎందుకు కీలకం?
Embed widget