మునుపెన్నడు లేనంతగా ఆ దారిలో నయన్… | Nayanthara in the Way Never Before
Begin typing your search above and press return to search.

మునుపెన్నడు లేనంతగా ఆ దారిలో నయన్…

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో సొంతం చేసుకున్న అందాల భామ నయనతార

By:  Tupaki Desk   |   19 May 2024 2:30 PM GMT
మునుపెన్నడు లేనంతగా ఆ దారిలో నయన్…
X

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో సొంతం చేసుకున్న అందాల భామ నయనతార. ఓ విధంగా చెప్పాలంటే కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా నయనతార క్రేజ్ కొనసాగుతోంది. తనకు తానే పోటీ అనేలా ఉన్న నయన్ సోలోగానే తన సినిమాలతో 50 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంటూ నిర్మాతలకి వరంలా మారింది. అందుకే కోలీవుడ్ లో నయనతారతో ఫీమేల్ సెంట్రిక్ కథలు చేయడానికి దర్శక, నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు.

ఆమె చివరిగా షారుఖ్ ఖాన్ జవాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. జవాన్ తో నయనతారకి బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ దర్శక, నిర్మాతలు నయనతార డేట్స్ కోసం ట్రై చేస్తున్నారంట. ఇక రెమ్యునరేషన్ లెక్క కూడా మునుపటి కంటే డబుల్ అయ్యింది. ఇక ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా బడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.

ఇక కథలో ఏదో రెగ్యులర్ హీరోయిన్ లా కాకుండా ముఖ్యమైన పాత్ర ఉంటేనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోందట. ఇక మరొక విషయానికి వస్తే.. గత కొంతకాలంగా ఈ బ్యూటీ దేవాలయాల చుట్టూ తిరుగుతూ ప్రత్యేక పూజలు చేస్తోంది. భర్తతో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటుంది. రకరకాల పూజలు చేయించుకుంటుంది. దీనికి కారణం ఆమె జాతక దోషం అనే ప్రచారం నడుస్తోంది.

నయనతార జాతకంలో గండాలు ఉండటంతో వాటిని పరిష్కరించుకోవడానికి ఇలా పూజలు చేస్తున్నట్లు టాక్. అలాగే వ్యక్తిగత జీవితంలో సమస్యలు తొలగిపోవాలని ప్రత్యేక హోమాలు కూడా నయనతార, విగ్నేష్ దంపతులు చేస్తున్నారంట. గతంలో వేణుస్వామి నయనతార జాతకంపై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

నయనతార విడాకులు తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. పెళ్లి తర్వాత ఆధ్యాత్మిక చింతన నయనతారకి పెరిగిందని, అందుకే అవకాశం దొరికినపుడు పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటున్నారని ఆమె అభిమానులు అంటున్నారు. నయనతార జాతకంలో ఎలాంటి దోషాలు లేవని, అదంతా ప్రచారమని కొట్టిపారేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నయనతార ఓ కన్నడ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అలాగే హిందీ, తమిళంలో కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. తెలుగులో నయనతార ఎలాంటి సినిమాలు చేయడం లేదు. ఆమె మొదటి ప్రయారిటీ తమిళ సినిమాలకే ఇస్తోంది. టాలీవుడ్ దర్శక, నిర్మాతలు నయనతారని సంప్రదిస్తున్న రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తుందంట. దీంతో భయపడి ఆమెని పరిగణంలోకి తీసుకోవడం మానేసినట్లు టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ కోసం నయనతారని సంప్రదించారంట. అయితే రెమ్యునరేషన్ కారణంగా ఆమె స్థానంలో త్రిషని ఫైనల్ చేసినట్లు టాక్.