Love Guru OTT streaming: విజయ్ ఆంటోనీ రోమియో తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది-vijay antony romeo movie telugu version love guru makes ott debut streaming in prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Love Guru Ott Streaming: విజయ్ ఆంటోనీ రోమియో తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది

Love Guru OTT streaming: విజయ్ ఆంటోనీ రోమియో తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది

Hari Prasad S HT Telugu
May 10, 2024 10:23 PM IST

Love Guru OTT streaming: తమిళ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన మూవీ రోమియో తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం (మే 10) నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

విజయ్ ఆంటోనీ రోమియో తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది
విజయ్ ఆంటోనీ రోమియో తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది

Love Guru OTT streaming: విజయ్ ఆంటోనీ నటించిన తమిళ మూవీ రోమియో. ఈ సినిమా తెలుగులోనూ లవ్ గురు పేరుతో రిలీజైంది. అయితే పెద్దగా బజ్ లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇప్పుడీ మూవీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. తమిళ, తెలుగు వెర్షన్లు రెండూ రెండు వేర్వేరు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.

లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్

విజయ్ ఆంటోనీ రోమియో మూవీకి అటు తమిళంలోనూ పెద్దగా ఆడలేదు. తెలుగులో అయితే అసలు చాలా మందికి ఈ సినిమా వచ్చినట్లు కూడా తెలియదు. ఇప్పుడీ మూవీ ఆహా తమిళం, ప్రైమ్ వీడియో ఓటీటీల్లోకి వచ్చేసింది. శుక్రవారం (మే 10) నుంచి ఈ రెండు ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ మాత్రం ప్రైమ్ వీడియోలో ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంది.

ఏప్రిల్ 11న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. తమిళ వెర్షన్ రోమియో ఓటీటీ రిలీజ్ డేట్ పై కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నా.. తెలుగు వెర్షన్ లవ్ గురు గురించి ఏమీ చెప్పలేదు. ఇక ఇప్పుడు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నేరుగా ప్రైమ్ వీడియో ఓటీటీలోకి లవ్ గురు మూవీ వచ్చేసింది.

లవ్ గురు చిత్రాన్ని మంచి రిలేషన్‍షిప్ డ్రామాగా.. పర్‍ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారని, కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్ కూడా బాగా పండిందని ఈ మూవీ చూసిన కొందరు నెటిజన్లు ట్వీట్లు చేశారు.

వీకెండ్ ఓటీటీ రిలీజెస్

ఈ వీకెండ్ లవ్ గురు మూవీతోపాటు చాలా సినిమాలు, వెబ్ సిరీస్ ఓటీటీల్లోకి వచ్చాయి. వారం ఓటీటీల్లోకి సినిమాలు, వెబ్ సిరీసులు కలుపుకుని 21కిపైగా స్ట్రీమింగ్‌కు వచ్చాయి.

వాటిలో ఇవాళ ఒక్కరోజే అంటే మే 10న ఏకంగా 14 సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ అవుతున్నాయి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

లివింగ్ విత్ లిపార్డ్స్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 10

బ్లడ్ ఆఫ్ జీసస్ సీజన్ 2 (వెబ్ సిరీస్)- మే 10

కుకింగ్ ఆప్ మర్డర్: అన్‌కవరింగ్ ది స్టోరీ ఆఫ్ సీజర్ రోమన్ (డాక్యుమెంట్ సిరీస్)- మే 10

ది అల్టిమేటమ్: సౌతాఫ్రికా (రియాలిటీ షో)- మే 10

జీ5 ఓటీటీ

8 ఏఎమ్ మెట్రో (హిందీ చిత్రం)- మే10

పాష్ బాలిష్ (బెంగాలీ వెబ్ సిరీస్)- మే 10

జియో సినిమా ఓటీటీ

మర్డర్ ఇన్ మహిమ్ (హిందీ వెబ్ సిరీస్)- మే 10 స్ట్రీమింగ్

ప్రెట్టీ లిటిల్ లయర్స్: సమ్మర్ స్కూల్ - మే 10

రోమియో (తమిళ సినిమా)- ఆహా తమిళ్- మే 10 స్ట్రీమింగ్

అన్‌దేకి సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- మే 10 స్ట్రీమింగ్

ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం)- లయన్స్ గేట్ ప్లే- మే 10 స్ట్రీమింగ్

ఫ్యూచర్ పొండాటి (తమిళ వెబ్ సిరీస్)- సన్ నెక్ట్స్ ఓటీటీ- మే 10 స్ట్రీమింగ్

బయోస్పియర్- హుళు ఓటీటీ- మే 10 స్ట్రీమింగ్

చాల్చిత్ర ఏఖాన్- హోయ్‌చోయ్ ఓటీటీ- మే 10 స్ట్రీమింగ్

IPL_Entry_Point