IPL 2024 : ఉత్కంఠ పోరులో చెన్నై ఓటమి.. ఫ్లేఆఫ్స్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్..! – News18 తెలుగు

PRESENTS

ప్రకటనలు
తెలుగు వార్తలు / వార్తలు / క్రీడలు / IPL 2024 : ఉత్కంఠ పోరులో చెన్నై ఓటమి.. ఫ్లేఆఫ్స్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్..!

IPL 2024 : ఉత్కంఠ పోరులో చెన్నై ఓటమి.. ఫ్లేఆఫ్స్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్..!

IPL 2024 : ఉత్కంఠ పోరులో చెన్నై ఓటమి.. ఫ్లేఆఫ్స్ కు రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరు  టీమ్..!

IPL 2024 : ఉత్కంఠ పోరులో చెన్నై ఓటమి.. ఫ్లేఆఫ్స్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్..!

చివరి వరకు ఉత్కంఠగా సాగిన కీలక పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌పై 27 పరుగుల తేడాతో బెంగళూరు గెలిచింది. దాంతో ఆర్సీబీ జట్టు ఫ్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. 219 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై పోరాడి ఓడింది. ఫలితంగా సీఎస్‌కే టోర్నీ నుంచి నిష్ర్కమించింది. చెన్నై బ్యాటింగ్లో చివర్లో జడేజా (42*) పరుగులతో ఆదుకున్నప్పటికీ చివరికి ఓటమిపాలైంది. ధోనీ కూడా (25) పరుగులతో రాణించాడు. చెన్నై బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ అయి నిరాశపరిచాడు.

  • 1-MIN READ News18 Telugu Hyderabad,Unnao,Uttar Pradesh
  • Last Updated :

చివరి వరకు ఉత్కంఠగా సాగిన కీలక పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌పై 27 పరుగుల తేడాతో బెంగళూరు గెలిచింది. దాంతో ఆర్సీబీ జట్టు ఫ్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. 219 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై పోరాడి ఓడింది. ఫలితంగా సీఎస్‌కే టోర్నీ నుంచి నిష్ర్కమించింది. చెన్నై బ్యాటింగ్లో చివర్లో జడేజా (42*) పరుగులతో ఆదుకున్నప్పటికీ చివరికి ఓటమిపాలైంది. ధోనీ కూడా (25) పరుగులతో రాణించాడు. చెన్నై బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ అయి నిరాశపరిచాడు.

ప్రకటనలు

రచిన్ రవీంద్ర (61) పరుగులతో రాణించాడు. డేరిల్ మిచెల్ (4), అజింక్యా రహానే (33) రన్స్ చేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన శివం దూబే (7) పరుగులు చేశాడు. మిచెల్ సాంథ్నర్ (3) రన్స్ సాధించారు. ఆర్సీబీ బౌలింగ్ లో యష్ దయాళ్ కీలకమైన 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత గ్లేన్ మ్యాక్స్వెల్, సిరాజ్, ఫెర్గుసన్, కెమెరాన్ గ్రీన్ తలో వికెట్ సంపాదించారు.

ఇదీ చదవండి : ఐపీఎల్‌లో టీమిండియా క్రికెటర్లు అలసిపోయారు.. ఇక, టీ20 ప్రపంచకప్‌లో మన జట్టు అస్సామే’

ఇక అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటింగ్ లో అందరూ సమిష్టిగా రాణించారు. ఆర్సీబీ ఓపెనర్లలో విరాట్ కోహ్లీ (47), డుప్లెసిస్ (54) పరుగులతో శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత.. రజత్ పటిదార్ (41) పరుగులతో చెలరేగాడు.

ప్రకటనలు

కెమెరాన్ గ్రీన్ (38*) నిలిచాడు. దినేష్ కార్తీక్ (14), మ్యాక్స్ వెల్ (16) పరుగులు చేశారు. అత్యధికంగా.. కెప్టెన్ డుప్లెసిస్ 54 పరుగులు చేయగా.. అతని ఇన్నింగ్స్ లో 3 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ లో 4 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. ఇక.. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత తుషార్ దేశ్‌ పాండే, మిచెల్ సాంథ్నర్ తలో వికెట్ సంపాదించారు.

ప్రకటనలు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..
  • First Published :
ప్రకటనలు
ప్రకటనలు

NEWS 18 తెలుగు ట్రెండింగ్

మరిన్ని వార్తలు
ప్రకటనలు